#Trendings 2020:
కొత్త సంవత్సరం అనగానే చాలామంది చాల తీర్మానాలు తీసుకుంటారు. అలాగే తీసుకున్నారు ప్రాముక్యంగ 2020 అనే నెంబర్ చాల బాగుంది అని అద్భుతాలు జరిగే అవకాశం ఉందిఅని, అనేక కొత్త ఇన్నోవేషన్స్ వస్తాయి అని చాల మంది ఆశలు పెట్టుకొని కొత్త సంవత్సరంలోకి 2020 అడుగుపెట్టారు.
మొదటినెల జనవరి సగము కాకముందే వేరే(china) దేశాలలో ఎదో వైరస్, ఎదో వైరస్ కరోనా వైరస్ అంట చాలామంది చనిపోతున్నారంట, అడావుడి మొదలయింది వారికోసం అందరు ప్రార్థనలు చేయటం మొదలుపెట్టారు.
ఇక్కడి వరకు బాగానేవుంది తరువాత ఆరోగ్య సంస్థ ఎప్పుడైతే ప్రాణాంతకం అని ప్రకటించిందో ప్రపంచ దేశాలు ఒక్కాసారిగా వణికిపోయాయి. అన్ని దేశాలలో lockdown ప్రకటించటం ఎవరుకూడా భయట తిరగకూడదు అని చెప్పినప్పుడు అందరు భయానికి గురిఅవవలసి వచ్చింది.
రవాణా సంస్థ ఆగిపోయింది, ఎక్కడివారు అక్కడే ఆగిపోయారు, ఉద్యోగ సంస్థలు ఇంటినుండి పనులు మొదలుపెట్టారు, రవాణా ఆగిపోవటంవలన వలస కార్మికులు కాలినడకన ప్రయాణం మొదలుపెట్టారు, అందులోభాగంగా కొంతమంది నడవలేక ప్రాణాలు వదిలిన పరిస్థితి.
ఎటు చుసిన భయం భయంకర పరిస్థితి, ఒక్క ప్రాంతంకాదు, ప్రపంచ దేశాలు అతలాకుతలం అయిపోయాయి. ప్రతి ఇంటిలో అందరూ భయపడుతూ ప్రాణాలను గుపిట్లో పెట్టుకొని ఎక్కడ ఏమూలన వైరస్ అంటుతుందో అని చాల జాగ్రత్తలుతీసుకుంటూ గడపవలసి వచ్చింది.
నిరంతర సమాచారం తెలుసుకుంటూ ప్రభుత్వం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది, ఒకవేళ కంటికికనబడని వైరస్ వస్తే ఎలా ఎదురుకోవాలి ప్రతి రోజు ప్రతి సెకండ్ ఆలోచనలో కూడా అదే అదే వినికిడి కరోనా వైరస్. ఎప్పటికి అప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటున్నా వైరస్ ఎటాక్ అవుతూనేఉంది అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, కుటుంబ సభ్యులను పోగొట్టుకున్నారు.
బయట ఆహారం దొరకడంలేదు అనేక సమస్యలగుండా వెళ్తూ, పేదవారికి, మధ్యతరగతి వారికీ సమస్యలను ఎదురుకోవటం ఒక సవాలుగా మారింది. ఇలాంటి సమయంలో అనేకమంది దాతలు ముందుకువచ్చి వైరస్ కి భయపడకుండా ఆహారాన్ని సరఫరా చేసారు, ఆహారంలేనివారికి ఆహారం ఉచితంగా అందించి వారిని ఆదుకున్నారు. వారి గొప్ప మనసుతో త్యాగాలు చేసి మరి సహాయం చేయటం జరిగింది మనం అందరం చూసాము.
#Sonu Sood Sir:
Sonu Sood Sir గురించి తెలియని వారు ఎవరు లేరు ఎందుకంటే అయన చేసిన సహాయం ప్రపంచదేశాలకు బాగా తెలుసు. ప్రత్యేకంగా వలస కార్మికులు కాలినడక తో దూర ప్రాంతాలకు వెళ్తుంటే తనమనసు కరిగిపోయింది, వారికీ వారికోసం ఆహారం పెట్టి ప్రత్యేకంగా వారికీ వాహనాలు ఏర్పాటుచేసి వారి వారి ప్రాంతాలకు పంపించటం జరిగింది. సహాయం కోసం ఎదురుచూస్తున్న వారికీ సహితం వారు ఎక్కడ ఉన్నపటికీ వారికీ అందేలా సహాయం చేసారు చేస్తూనే ఉన్నారు సోనూ సూద్ గారు.
Sonu Sood Sir గురించి చెప్పాలంటే ఒక పెద్ద బిలియనీర్ కాదు, ఒక పెద్ద హీరో కాదు, ఒక సాధారణ ఆక్టర్ మాత్రమే కానీ ఒక మంచి మనసున్న రియల్ హీరో సోను సూద్ గారు. ఎవ్వరు ఎలాటి సహాయం కావాలన్నా వారికీ సహాయం చేయటం మనం చూసాము. నిజంగా Sonu Sood Sir ఒక రియల్ హీరో.
#Jobs loss:
ఈ కరోనా వల్ల చాల మంది ఆర్థికంగా చాల నష్టపోయారు చాలామందికి ఉద్యోగాలు పోయాయి, ఉద్యోగాలు రాలేదు, మరియు వ్యాపారాలలో నష్టం, వ్యాపారాలు కొలిపోవటం, జరిగింది. కొన్ని వేళ్ళ ఉద్యోగ నష్టం మరియు వ్యాపారాలు నష్టపోయాయి. దీని ద్వారా ఆర్థికంగా చాల ఇబందులు జరిగాయి.
తినటానికి కూడా సరైన ఆహారంలేక ఎదో ఒక పని చేసుకొని పూత గడిపే రోజులలో ఉన్నాము, సాఫ్ట్వేర్ జాబ్స్ పోయినవారు సహితం వ్యవసాయం చేయటం, టీచర్స్ కి స్కూల్స్ లేకపోవటం వాళ్ళ చివరికి బ్రతకడానికి పళ్ళు అమ్ముకొని జీవించిన రోజులు చూస్తున్నాము.
#Worship:
ప్రతి మనిషి సంతోషంగా ఉన్నప్పుడో, భాదగా ఉన్నప్పుడో లేదా సందర్భాన్ని భట్టి తన దేవునితో మాట్లాడటానికి, దేవునిని కొలవటానికి టెంపుల్, చర్చి లకు వెళ్ళటం సర్వసాధారణం, కానీ ఈ కోవిద్ (Covid-19) వళ్ళ అన్ని టెంపుల్స్, చర్చి అన్ని మూతపడటం జరిగింది, ఎవరుకూడా వెళ్లకుండా వారి వారి ఇళ్ల లోనే ఆరాధన చేసుకోవటం, పూజించుకోవటం జరిగింది.
దేవుడిని కలుసుకోవటం లేదుకదా, దూరంగా ఉన్న, దగ్గరగ ఉన్న బంధువులను, స్నేహితులను కలుసుకోవటం పూర్తిగా కష్టంగా మారింది, ఒకవేళ కలవాలన్న డిస్టెన్స్ దూరం పాటించాలి, మాస్క్ ధరించాలి, సొంత వల్లనే దూరం పెట్టి దూరం నుండి చూసే రోజులలో ఉన్నాము.
#కరోనా వల్ల ఏంటి మేలులు (Uses caused by corona):
కరోనా వల్ల ఏమైనా మేలు కూడా జరిగిందా అంటే అవును అనే చెప్పాలి, ఎందుకంటే ఎంత ఐతే నష్టం జరిగిందో ఎంతో కొంత మేలు కూడా జరిగింది. అందరు ఇంటిలో ఉండటం వల్ల వారి వారి సంతోషాన్ని, బందాలను పెంచుకున్నారు, ఇంటిలో ఉండి ఆఫీస్ పనులు చేసుకోవటం, కొందరు కొత్త ఇన్నోవేషన్స్ చేయటం, కొత్త ఆలోచనలు, కొత్త కోర్సులు నేర్చుకోవటం, పరిశుభ్రంగా ఉంటూ అందరిని పరిశుభ్రంగా ఉంచటం, అందరు బాగుండాలి, మన పక్కవారు బాగుండాలి అని కోరుకోవటం మరియు ప్రాముక్యంగ ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవటం, వీటన్నిటివల్ల కూడా కొంతమేర మేలు జరిగిందని చెప్పవచ్చు.
Post a Comment